సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌.. 143 పరుగుల తేడాతో ఘన విజయం | Mandhana, Asha Sobhana Hand India Massive 143-Run Win, Take 1-0 Lead In Three-Match ODI Series | Sakshi
Sakshi News home page

IND-W Vs SA-W: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌.. 143 పరుగుల తేడాతో ఘన విజయం

Published Sun, Jun 16 2024 8:48 PM

Mandhana, Asha Sobhana hand India massive 143-run win, take 1-0 lead in three-match ODI series

స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్‌, తలా వికెట్‌ పడగొట్టారు. ప్రోటీస్‌ బ్యాటర్లలో సునీ లూస్‌(33) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.

ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్‌(31 నాటౌట్‌) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్‌ రెండు, డెకరసన్‌, మల్బా, షాంగసే తలా వికెట్‌ సాధించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement