ఫైన‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. ఐపీఎల్ 2024 విజేత‌గా కేకేఆర్‌ Kolkata Knight Riders beat SRH by 8 wickets, to win third IPL title | Sakshi
Sakshi News home page

IPL 2024: ఫైన‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. ఐపీఎల్ 2024 విజేత‌గా కేకేఆర్‌

Published Sun, May 26 2024 10:50 PM | Last Updated on Mon, May 27 2024 9:53 AM

Kolkata Knight Riders beat SRH by 8 wickets, to win third IPL title

ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను  చిత్తు చేసిన కేకేఆర్‌.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.

కుప్పకూలిన ఎస్‌ఆర్‌హెచ్‌..
టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. 

కేకేఆర్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ఆరోరా ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్‌ మూడు వికెట్లతో ఆరెంజ్‌ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(24) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌(20), క్లాసెన్‌(16) పరుగులు చేశారు.

అయ్యర్‌, గుర్బాజ్ విధ్వంసం..
అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌(52 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్‌, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో తలా వికెట్ సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement