చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2024 In IPL 2024 Record Breaking 14 Centuries Have Been Scored, Highest Ever In IPL History | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2024

Published Tue, May 28 2024 8:26 PM | Last Updated on Tue, May 28 2024 8:26 PM

In IPL 2024 Record Breaking 14 Centuries Have Been Scored, Highest Ever In IPL History

ఐపీఎల్‌ 2024 సీజన్‌ సెంచరీల విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్‌లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్‌ బద్దలు కొట్టింది. 

ఈ సీజన్‌లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్‌ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్‌ స్టోయినిస్‌ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. 
విరాట్‌ కోహ్లి (72 బంతుల్లో 113*), 
సునీల్‌ నరైన్‌ (56 బంతుల్లో 109), 
రుతురాజ్‌ గైక్వాడ్‌ (60 బంతుల్లో 108*), 
జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108*), 
జోస్‌ బట్లర్‌ (60 బంతుల్లో 107*), 
రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 105*), 
యశస్వి జైస్వాల్‌ (60 బంతుల్లో 104*), 
శుభ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 104), 
సాయి సుదర్శన్‌ (51 బంతుల్లో 103), 
సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 102*), 
ట్రవిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 102), 
జోస్‌ బట్లర్‌ (58 బంతుల్లో 100*), 
విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. 
ఈ సీజన్‌ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్‌ హెడ్‌, విల్‌ జాక్స్‌ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్‌ ఆర్సీబీపై.. జాక్స్‌ గుజరాత్‌పై 41 బంతుల్లో శతక్కొట్టారు.

సీజన్ల వారీగా సెంచరీలు..
2024- 14 సెంచరీలు
2023- 12 సెంచరీలు
2022- 8 సెంచరీలు
2021- 4 సెంచరీలు
2020- 5 సెంచరీలు
2019- 6 సెంచరీలు
2018- 5 సెంచరీలు
2017- 5 సెంచరీలు
2016- 7 సెంచరీలు
2015- 4 సెంచరీలు
2014- 3 సెంచరీలు
2013- 4 సెంచరీలు
2012- 6 సెంచరీలు
2011- 6 సెంచరీలు
2010- 4 సెంచరీలు
2009- 2 సెంచరీలు
2008- 6 సెంచరీలు

ఓవరాల్‌గా 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement