IPL 2023: Siraj Gets Emotional 'Wish I Had Gotten One Last Chance To Meet You' - Sakshi
Sakshi News home page

Mohammed Siraj: మిమ్మల్ని చివరిగా ఒక్కసారైనా కలవాలనుకున్నా.. కానీ: అవార్డు అంకితమిస్తూ సిరాజ్‌ భావోద్వేగం

Published Fri, Apr 21 2023 4:18 PM | Last Updated on Fri, Apr 21 2023 5:22 PM

IPL 2023 Siraj Gets Emotional: Wish Had Gotten One Last Chance To Meet You - Sakshi

Mohammed Siraj Dedicates POTM To Late Hyderabad Cricketer: ‘‘ప్రియమైన అజీం సర్‌. నాకు, నాలాంటి ఎంతో మందికి మీరు అందించిన ప్రోత్సాహం గురించి నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మీ మనసు ఎంతో మంచిది. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు. తోచిన సహాయం చేస్తారు.

నాకు మిమ్మల్ని పరిచయం చేసినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ మీ కడచూపునకు నోచుకోలేకపోయాను. ఈనాటి ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను మీకు అంకితం ఇస్తున్నాను’’ అంటూ హైదరాబాదీ స్టార్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. చివరిగా ఒక్కసారైనా అజీం సర్‌ను కలవాలనుకున్నానని.. అయితే, అంతకంటే ముందే ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

నాలుగు వికెట్లతో మెరిసి
ఐపీఎల్‌-2023లో భాగంగా గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సిరాజ్‌ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ ఆర్సీబీ స్టార్‌.. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పంజాబ్‌ ఓపెనర్‌ అథర్వ టైడే(4), పవర్‌ హిట్టర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌(2), హర్‌ప్రీత్‌ బ్రార్‌(13), నాథన్‌ ఎల్లిస్‌ (1)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు
అదే విధంగా హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియాను రనౌట్‌ చేశాడు. ఇలా మొహాలీ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు దక్కిన అవార్డును.. ఇటీవల మరణించిన హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీంకు అంకితమిచ్చాడు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

కోచ్‌గా, సెలక్టర్‌గా
62 ఏళ్ల అబ్దుల్‌ అజీం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 80,90 దశకాల్లో హైదరాబాద్‌ జట్టు తరఫున మేటి ఓపెనర్‌గా ఎదిగిన ఆయన మొత్తంగా తన కెరీర్‌లో 73 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 4644 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఆటగాడిగా కెరీర్‌ ముగించిన తర్వాత అజీం హైదరాబాద్‌ కోచ్‌గా, సెలక్టర్‌గా పని చేశారు.

చదవండి: సర్జరీ సక్సెస్‌... టీమిండియాకు గుడ్‌న్యూస్‌! మెగా టోర్నీకి అందుబాటులోకి!
ఒకప్పుడు టీమిండియా కెప్టెన్‌.. ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement