అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ఆడిన సర్ఫరాజ్‌.. సహనం కోల్పోయిన మార్క్‌ వుడ్‌ IND VS ENG 5th Test Day 2: Sarfaraz Khan Played Super Ramp Shot Against Mark Wood | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ఆడిన సర్ఫరాజ్‌.. సహనం కోల్పోయిన మార్క్‌ వుడ్‌

Published Fri, Mar 8 2024 2:53 PM | Last Updated on Sat, Mar 9 2024 7:02 AM

IND VS ENG 5th Test Day 2: Sarfaraz Khan Played Super Ramp Shot Against Mark Wood - Sakshi

IND VS ENG 5th Test Day 2: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ రెండో రోజు ఆటలో టీమిండియా యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్‌ కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో కెరీర్‌లో మూడో అర్ధశతకాన్ని సాధించాడు.

తొలి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్దసెంచరీలు (62, 68 నాటౌట్‌) చేసిన సర్ఫరాజ్‌.. తన రెండో టెస్ట్‌లో విఫలమైనా (14, 0) తిరిగి మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దసెంచరీతో సత్తా చాటాడు. టీ విరామం సమయానికి సర్ఫరాజ్‌ 56 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా పడిక్కల్‌ (44) క్రీజ్‌లో ఉన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110) ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌, ఆండర్సన్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, రెండో రోజు ఆటలో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడిన అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఇది ట్రేడ్‌ మార్క్‌ షాట్‌. ఇతను చాలా సందర్భాల్లో ఇలాంటి షాట్లు ఆడాడు. నాలుగో టెస్ట్‌లో దృవ్‌ జురెల్‌ సైతం వుడ్‌ బౌలింగ్‌లో ఇదే తరహా ర్యాంప్‌ షాట్‌ ఆడాడు. సర్ఫరాజ్‌ ర్యాంప్‌ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్‌ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. వుడ్‌ స్టెడ్జింగ్‌ను ఏమాత్రం పట్టించుకోని సర్ఫరాజ్‌ తన సహజశైలిలో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement