ఫిట్‌గా లేనప్పుడు ఎందుకు సెలక్ట్‌ చేశారు? వేరే వాళ్లని బలిచేసి.. | If Player Not Fit You Shouldnt Pick Him: Kris Srikkanth Slams KL Rahul Asia Cup 2023 Selection - Sakshi
Sakshi News home page

Kris Srikkanth On KL Rahul Selection: ఫిట్‌గా లేనప్పుడు అతడిని సెలక్ట్‌ చేయడం ఎందుకు? వేరే వాళ్లని బలిచేసి

Published Thu, Aug 24 2023 2:30 PM | Last Updated on Thu, Aug 24 2023 3:32 PM

If Player Not Fit You Shouldnt Pick Him: Kris Srikkanth On KL Rahul Asia Cup - Sakshi

'What is all this? Don't Select Him?: ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేనప్పుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుకని టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. ఫిట్‌నెస్‌ లేని ఆటగాడి కోసం మిగతా వాళ్లను బలి చేయడం సరికాదంటూ మండిపడ్డాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్‌-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

చీఫ్‌ సెలక్టర్‌ స్వయంగా చెప్పాడు
ఈ ‍క్రమంలో బీసీసీఐ.. సోమవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు సుదీర్ఘకాలం పాటు దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీతో పునరాగమనం చేయనున్నట్లు వెల్లడించాడు.

ఫిట్‌గా లేనివాడిని ఎందుకు ఎంపిక చేయడం?
అయ్యర్‌ వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించాడని.. రాహుల్‌ను గాయం వెంటాడుతోందని అగార్కర్‌ ఈ సందర్భంగా తెలిపాడు.  అయితే, ఈ వన్డే ఈవెంట్‌లో రెండు లేదంటే మూడో మ్యాచ్‌ నుంచి అతడు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీకాంతాచారి తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.

అసలేంటి ఇదంతా? 
‘‘కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌గా లేడని వాళ్లే చెప్పారు. ఒకవేళ ఆటగాడికి గాయం తాలుకు నొప్పి ఉంటే అతడిని సెలక్ట్‌ చేయొద్దు. సెలక్షన్‌ సమయంలో పూర్తి ఫిట్‌గా లేడని తెలిసినపుడు అతడిని ఎంపిక చేయొద్దనేది మన పాలసీ కదా!

సెలక్షన్‌ నాటికి ఫిట్‌గా లేనివాడికి అవకాశం ఇవ్వడం దేనికి? ఒకవేళ వరల్డ్‌కప్‌ నాటికి అతడిని సిద్ధం చేయాలనుకుంటే.. అప్పుడే సెలక్ట్‌ చేయండి. అది వేరే విషయం. అంతేగానే ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఆడడు కానీ.. అతడిని సెలక్ట్‌ చేశాం. 

సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపిక చేశాం అనడం.. అసలేంటి ఇదంతా? ఇలా చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’’ అంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేశాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ చిక్కా చురకలు అంటించాడు.

ఆసియా వన్డే కప్‌-2023 బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు:
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.
స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.

చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! స్కోరెంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement