ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్‌! సిరాజ్‌కు నో ప్లేస్‌ Harbhajan Singh Picks India XI For 2nd Test Against England | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్‌! సిరాజ్‌కు నో ప్లేస్‌

Published Thu, Feb 1 2024 10:37 AM | Last Updated on Thu, Feb 1 2024 12:24 PM

Harbhajan Singh Picks India XI For 2nd Test Against England - Sakshi

విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌ కోసం తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ ఎంచుకున్నాడు. వైజాగ్‌ టెస్టులో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని  హర్భజన్ సూచించాడు. 

అదే విధంగా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉందని, ఐదో స్ధానానికి సరిపోతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇక హర్భజన్ తను ఎంపిక చేసిన జట్టులో కేవలం ఒకే పేసర్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు.

ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో పేస్‌ గుర్రం బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్‌ను వైజాగ్‌ టెస్టుకు హర్భజన్ పక్కన పెట్టాడు. అతడి స్ధానంలో వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చాడు. కుల్దీప్‌ బంతితో అద్బుతాలు చేయగలడని హర్భజన్ సింగ్‌ తన యూట్యాబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

రెండో టెస్టుకు హర్భజన్ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కేఎస్‌ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement