Faf Du Plessis Will Be Appointed as New Captain of Royal Challengers Bangalore - Sakshi
Sakshi News home page

IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!

Published Thu, Feb 17 2022 3:05 PM | Last Updated on Thu, Feb 17 2022 8:03 PM

Faf Du Plessis will be Appointed as NEW CAPTAIN of Royal Challengers Bangalore, announcement coming soon Says Reports - Sakshi

రాయల్‌ ఛాలంజెర్స్‌ బెంగళూరుకు త్వరలో కొత్త కెప్టెన్‌ రాబోతున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు  ఫాప్ డుప్లిసెస్‌ ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. డుప్లిసెస్‌ను కెప్టెన్‌గా ఆర్సీబీ యాజమాన్యం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడి మరి అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌ అవుతాడని అంతా భావించారు.

ఈ క్రమంలోనే డివిలియర్స్‌ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక  మాక్స్‌వెల్ కూడా కెప్టెన్‌గా ఒక ఆఫ్షన్‌గా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ డుప్లిసెస్‌ వైపే మెగ్లు చూపినట్లు తెలుస్తోంది. "మా జట్టు కెప్టెన్‌గా డుప్లిసెస్‌ సరైనోడు అని భావిస్తున్నాం. అయితే మేము నిర్ణయించుకోవడానికి మాకు సమయం ఉంది. మాక్స్‌వెల్‌ అందుబాటుపై  స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము. అతడు తన వివాహం​ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డుప్లిసెస్‌ సరైన ఎంపికగా కనిపిస్తోంది" అని ఆర్సీబీ ఆధికారి ఒకరు పేర్కొన్నారు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు:
విరాట్‌ కోహ్లి: రూ. 15 కోట్లు 
మ్యాక్స్‌వెల్‌: రూ. 11 కోట్లు 
హర్షల్‌ పటేల్‌: రూ. 10 కోట్ల 75 లక్షలు 
హసరంగ:  రూ. 10 కోట్ల 75 లక్షలు 
హాజెల్‌వుడ్‌:   రూ. 7 కోట్ల 75 లక్షలు 
సిరాజ్‌  :రూ. 7 కోట్లు 
డు ప్లెసిస్‌:    రూ. 7 కోట్లు 
దినేశ్‌ కార్తీక్‌:    రూ. 5 కోట్ల 50 లక్షలు 
అనూజ్‌ రావత్‌: రూ. 3 కోట్ల 40 లక్షలు 
షాబాజ్‌ అహ్మద్‌:    రూ. 2 కోట్ల 40 లక్షలు 
రూథర్‌ఫొర్డ్‌:    రూ. 1 కోటి 
మహిపాల్‌ లామ్రోర్‌:    రూ. 95 లక్షలు 
ఫిన్‌ అలెన్‌:    రూ. 80 లక్షలు 
బెహ్రెండార్ఫ్‌:    రూ.75 లక్షలు 
కరణ్‌ శర్మ:    రూ. 50 లక్షలు 
సుయశ్‌ ప్రభుదేశాయ్‌:    రూ.30 లక్షలు 
సీవీ మిలింద్‌:    రూ. 25 లక్షలు 
ఆకాశ్‌దీప్‌:    రూ. 20 లక్షలు 
అనీశ్వర్‌ గౌతమ్‌ :    రూ. 20 లక్షలు

చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement