39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్‌-21 చాంపియన్‌ ఇంగ్లండ్‌ England Beat Spain By 1-0 Clinch 2023 European Under-21 Since 1984 | Sakshi
Sakshi News home page

Euro 2023: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్‌-21 చాంపియన్‌ ఇంగ్లండ్‌

Published Sun, Jul 9 2023 9:36 AM | Last Updated on Sun, Jul 9 2023 10:17 AM

England Beat Spain By 1-0 Clinch 2023 European Under-21 Since 1984 - Sakshi

అండర్‌-21 యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా ఇంగ్లండ్‌ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్‌ మళ్లీ చాంపియన్‌గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్‌తో  జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తరపున వచ్చిన ఏకైక గోల్‌ కర్టిస్‌ జోన్స్‌ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్‌ అందించాడు.

ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్‌ అదే పనిగా గోల్‌ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్‌ గోల్‌కీపర్‌ జేమ్స్‌ ట్రాఫర్డ్‌ రెండుసార్లు స్పెయిన్‌ పెనాల్టీ కిక్‌లు గోల్‌ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్‌ యూరో అండర్‌-21 విజేతగా నిలవడం విశేషం.

చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్‌ దిగ్గజం

IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement