CWG 2022: దూసుకుపోతున్న భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరో పతకం | CWG 2022: Indias Vikas Thakur Wins Silver In Mens 96kg Weightlifting | Sakshi
Sakshi News home page

CWG 2022: దూసుకుపోతున్న భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరో పతకం

Published Tue, Aug 2 2022 9:34 PM | Last Updated on Tue, Aug 2 2022 9:34 PM

CWG 2022: Indias Vikas Thakur Wins Silver In Mens 96kg Weightlifting - Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్‌, పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్లలో స్వర్ణ పతాకలు సాధించిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో తాజా మరో పతకం సాధించింది. పురుషుల 96 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వికాస్ సింగ్‌ రజతం సాధించాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కేజీలు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వికాస్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన వికాస్.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో సమోవాకి చెందిన డాన్ ఓపెలోగ్ (171+210=381 కేజీలు) స్వర్ణం గెలువగా.. ఫిజికి చెందిన తానియెల (155+188=343) కాంస్యం సాధించాడు. వికాస్ సింగ్ విజయంతో భారత పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
చదవండి: భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement