Carlos Alcaraz responds to Novak Djokovic 'spying' controversy at Wimbledon - Sakshi
Sakshi News home page

#CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'

Published Thu, Jul 13 2023 11:40 AM | Last Updated on Thu, Jul 13 2023 12:18 PM

Carlos Alcaraz Responds-Novak Djokovic Spying-Controversy At Wimbledon - Sakshi

టెన్నిస్‌లో ప్రస్తుతం కార్లోస్‌ అల్కారాజ్‌ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కారాజ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అల్కారాజ్‌ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో జొకోవిచ్‌ (సెర్బియా); డానిల్‌ మెద్వెదెవ్‌తో అల్కారాజ్‌‌ తలపడనున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్‌, అల్కారాజ్‌ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్‌ తండ్రికి టెన్నిస్‌ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సందర్భంగా మ్యాచ్‌లను చూడడానికి వచ్చిన అల్కారాజ్‌ తండ్రి.. సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ప్రాక్టీస్‌ వీడియోనూ ఫోన్‌లో బంధించాడు.

అయితే తన కొడుక్కి జొకోవిచ్‌ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్‌కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్‌ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. 

''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్‌ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్‌ ఇంగ్లండ్‌ టెన్నిస్‌ క్లబ్‌లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్‌ వన్‌ నుంచి టాప్‌-20 ర్యాంకింగ్‌ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్‌ను గమనిస్తూనే ఫోన్‌లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్‌ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్‌ లైఫ్‌లో నేను జొకోవిచ్‌తో మ్యాచ్‌ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్‌కే సపోర్ట్‌ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్‌ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరి మీ నాన్న జొకోవిచ్‌ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్‌ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్‌ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్‌ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్‌ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు.

చదవండి: T10 League: బ్యాట్‌ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్‌.. ఫ్యాన్స్‌కు పండగే

Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement