Asian Games 2023, Fencing: క్వార్టర్‌ ఫైనల్లో భవానీ దేవి ఓటమి.. | Asian Games 2023: Bhavani Devi Knocked Out In Women's Individual Sabre Quarter-Final - Sakshi
Sakshi News home page

Asian Games 2023, Fencing: క్వార్టర్‌ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..

Published Tue, Sep 26 2023 1:29 PM | Last Updated on Tue, Sep 26 2023 2:14 PM

Bhavani Devi knocked out in womens individual sabre quarter final - Sakshi

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో  చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది.

క్వార్టర్స్‌ మొదటి పీరియడ్‌ ఆరంభంలో మూడు టచ్‌లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి  యాకీ షావో అద్బుతమైన కమ్‌బ్యాక్‌ బ్యాక్‌ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్‌లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్‌లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది.

రెండో పీరియడ్‌లో చైనీస్‌ ఫెన్సర్‌ 6 టచ్‌లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్‌లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా  భవానీ దేవి చరిత్ర సృష్టించింది. 
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్‌ ఆటగాడు రీ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement