ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం | Asian Games 2023: India Win Gold Medal In Equestrian Dressage Team Event | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

Published Tue, Sep 26 2023 3:21 PM | Last Updated on Tue, Sep 26 2023 4:25 PM

Asian Games 2023: India Win Gold Medal In Equestrian Dressage Team Event - Sakshi

ఆసియా క్రీడల్లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్‌ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్‌, హ్రిదయ్‌ చద్దా, అనుష్‌ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్‌ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే (సెప్టెంబర్‌ 26) మూడు పతకాలు అందాయి.

భారత సెయిలర్లు నేహా ఠాకూర్‌ రజతం, ఎబాద్‌ అలీ, విష్ణు శరవనన్‌ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు)  చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్‌ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement