షూటింగ్‌లో భారత్‌కు 21వ ఒలింపిక్‌ బెర్త్‌ 21st Olympic berth for India in shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో భారత్‌కు 21వ ఒలింపిక్‌ బెర్త్‌

Published Mon, Apr 29 2024 3:55 AM | Last Updated on Mon, Apr 29 2024 3:55 AM

21st Olympic berth for India in shooting

పారిస్‌ ఒలింపిక్స్‌ చివరి క్వాలిఫయింగ్‌ షూటింగ్‌ టోర్నీలో భారత మహిళా స్కీట్‌ షూటర్‌ మహేశ్వరి చౌహాన్‌ రజత పతకం సాధించింది. దాంతో భారత్‌కు 21వ ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారైంది. 

దోహాలో ఆదివారం జరిగిన స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్‌ ఆఫ్‌’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్‌ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ను నిర్వహించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement