కేసీఆర్‌ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే.. | TS Police Case Registred Against BRS Kanna Rao For Land Issue, Know Details Inside - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావుపై కేసు నమోదు.. ఎందుకంటే?

Published Thu, Mar 14 2024 10:55 AM | Last Updated on Thu, Mar 14 2024 3:10 PM

TS Police Case Registred Against BRS Kanna Rao For Land Issue - Sakshi

సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్‌ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు.

ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement