సునీతా కేజ్రీవాల్‌ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్‌ Sunita Kejriwal makes dictatorship claim kejriwal ED Custody Extended | Sakshi
Sakshi News home page

సునీతా కేజ్రీవాల్‌ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్‌

Published Mon, Apr 1 2024 5:39 PM | Last Updated on Mon, Apr 1 2024 5:58 PM

Sunita Kejriwal makes dictatorship claim kejriwal ED Custody Extended - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్‌ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు  జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అలాగే తీహార్‌ జైలుకు తరలించాలని ఆదేశించింది.  ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

‘సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్‌ అన్నారు.

సునీతా కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై బీజీపీ  కౌంటర్‌ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీ‌ప్‌ సింగ్‌ పూరి సునీతా కేజ్రీవాల్‌ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్‌ సీఎంగా రాబోతుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలులో ఇద్దరు నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌తో కేబినెట్‌ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో  మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీ‌ప్‌ సింగ్‌ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement