‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్ | Shakti Swaroopa: Pm Narendra Modi Speaks To Sandeshkhali Victim, Bjp Basirhat Pick Rekha Patra | Sakshi
Sakshi News home page

‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్.. ‘శక్తి స్వరూపిణి’ అంటూ

Published Tue, Mar 26 2024 8:16 PM | Last Updated on Tue, Mar 26 2024 8:27 PM

Shakti Swaroopa: Pm Narendra Modi Speaks To Sandeshkhali Victim, Bjp Basirhat Pick Rekha Patra - Sakshi

న్యూఢిల్లీ :  పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్‌హట్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో  ఫోన్‌లో స్వయంగా మాట్లాడారు.  సందేశ్‌‌ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతల) తో పోల్చారు.

ప్రధాని మోదీ: సందేశ్‌ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

రేఖ పత్ర : తృణమూల్‌ కాంగ్రెస్‌ షాజహాన్‌ షేక్‌ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి.
 
ప్రధాని మోదీ : బసిర్‌హట్‌ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం.

రేఖపత్ర : సందేశ్‌ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం.

ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్‌సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్‌ కాంగ్రెస్‌ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా. 

ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం. 

రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు.  

ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి.  శక్తివంతమైన నేతను జైలుకే  పంపారు.  బసిర్‌హట్‌లోనే కాదు, వెస్ట్‌ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్‌ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్‌లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ  బసిర్‌హట్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement