Attempts To Buy 4 TRS MLAs Issue: Police Registered Case On Complaint Of TRS MLA Rohit Reddy - Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌ డీల్‌పై వెలుగులోకి షాకింగ్‌ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది?

Published Thu, Oct 27 2022 10:52 AM | Last Updated on Thu, Oct 27 2022 11:50 AM

Police Registered Case On Complaint Of TRS MLA Rohit Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పట్టుబడ ముగ్గురిని ఫౌంహౌస్‌లోనే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ ముగ్గురి ఫోన్ల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
చదవండి: ఫామ్‌ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు? 

కాగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. డీల్‌లో భాగంగానే స్వామీజీ, నందు, సతీష్ ఫాంహౌస్‌కు వచ్చారని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్‌ కేసులు పెడతామని.. ఈడీ,సీబీఐ దాడులు జరుగుతాయని బెదిరించారని రోహిత్‌ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు ఆఫర్‌ చేశారన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని డీల్‌ నడిచినట్లు ఫిర్యాదులో రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement