తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్‌ Neha Sharma React After her Father | Sakshi
Sakshi News home page

తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్‌

Published Wed, Jun 5 2024 11:32 AM | Last Updated on Wed, Jun 5 2024 1:36 PM

Neha Sharma React After her Father

లోక్‌సభ ఎన్నికల  ఫలితాలపై దేశమంతా ఆసక్తికనబరిచింది. ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ తదితర నటులతో పాటు బాలీవుడ్ నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా  పోటీ చేశారు. ఆయన బీహార్‌లోని భాగల్‌పూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ చేతిలో శర్మ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

తన తండ్రి ఓటమిపై నేహా శర్మ  ఆవేదనతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని కవితారూపంలో రాశారు. తన కుటుంబం తదుపరి అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా  ఉన్నదని ఆమె దానిలో పేర్కొన్నారు.

‘ఇది మాకు కష్టమైన రోజు. మేము అన్నివిధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఆయనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. మేము తదుపరి దశలో సాగే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఓటమితో కుంగిపోకుండా ఎప్పుడూ ముందుకు సాగాలని మనం గుర్తుంచుకోవాలి. పర్వతంలా ధృడంగా నిలవాలి. సింహంలా గర్జించాలి. నిర్భయంగా నిలబడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని నేహాశర్మ రాశారు. ఆమె భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన తండ్రి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నేహా శర్మ తెలుగులో రామ్‌చరణ్‌ సరసన ‘చిరుత’ సినిమాలో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement