పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'? | Lottery king Santiago Martin top purchaser of electoral bonds | Sakshi
Sakshi News home page

Electoral Bonds: పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?

Published Sun, Mar 17 2024 9:49 PM | Last Updated on Sun, Mar 17 2024 9:55 PM

Lottery king Santiago Martin top purchaser of electoral bonds - Sakshi

'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్‌కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్‌ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. 

రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్‌లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్‌ రద్దు చేసింది.

ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది.

డేటా ప్రకారం, 2018లో బాండ్‌లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్‌ఎస్‌ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది.

ఎవరీ శాంటియాగో మార్టిన్?
శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్‌ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్‌ బాండ్‌లను కొనుగోలు చేసింది.

మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం..  ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 

1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని  ప్రారంభించాడు. మార్టిన్‌ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్‌ దేశాలకు విస్తరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement