దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా? Kejriwal asks nation to boycott Chinese goods, slams Centre Govt | Sakshi
Sakshi News home page

దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?

Published Mon, Dec 19 2022 6:15 AM | Last Updated on Mon, Dec 19 2022 6:15 AM

Kejriwal asks nation to boycott Chinese goods, slams Centre Govt - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్‌ చేశారు.  ఆదివారం ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు.

ఎద్దు నుంచి పాలు పితికాం
గుజరాత్‌ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్‌లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement