నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని | Govt Whip Samineni Udayabhanu Comments On Nimmagadda Ramesh | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై ఎస్‌ఈసీ పునరాలోచించాలి

Published Sun, Jan 24 2021 4:08 PM | Last Updated on Sun, Jan 24 2021 4:14 PM

Govt Whip Samineni Udayabhanu Comments On Nimmagadda Ramesh - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏకపక్ష ధోరణి సరికాదని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన దుయ్యబట్టారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’

రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా ప్రారంభ దశలో ఎన్నికలు నిలిపివేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై పునరాలోచించాలని సామినేని ఉదయభాను కోరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement