Entire NCP With Maharashtra Government, Ajit Pawar Claims - Sakshi
Sakshi News home page

ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్‌పవార్‌

Published Sun, Jul 2 2023 5:34 PM | Last Updated on Sun, Jul 2 2023 6:06 PM

Entire NCP With Maharashtra Government Says Ajit Pawar Claims  - Sakshi

ముంబై: మహా రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు అలకపాన్పుపై ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంలో చేరి మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఎన్సీపీ మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.    

మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మరోసారి అదే సీన్ రిపీట్ చేశారు. కాకపోతే ఈసారి వారు షిండే నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో జత కట్టారు. ఆదివారం ఉదయం 40 మంది ఎమ్మెల్యేలతో గవర్నరును కలిసి వెంటవెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

మేము అధికారంలో ఉన్న రెండున్నరేళ్లలో మా దృష్టాంతా అభివృద్ధి మీదే ఉంది. మా నిర్ణయంపై విమర్శలు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకి తీసుకెళ్లాలన్న దాని గురించే మా ఆలోచనంతా అని ఆయన చెప్పుకొచ్చారు. 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారేమోనన్న ప్రశ్న తలెత్తగా.. మేము ప్రభుత్వంలో చేరామంటే ఎన్సీపీ పార్టీ ప్రభుత్వంతో చేతులు కలిపినట్టే. మేము ఎన్నికల్లో కూడా ఇదే ఎన్సీపీ గుర్తుపై పోటీ చేస్తామని అన్నారు అజిత్ పవార్. 

ఎన్డీయేతో పొత్తు గురించి ప్రస్తావించగా మూడున్నరేళ్ల క్రితం ఉద్ధవ్ థాక్రేతో కలిసి మహావికాస్ అఘాడి ప్రభుత్వంతో చేతులు కలిపాము. ఆరోజు శివసేనతో కలిసి వెళ్లినపుడు ఈరోజు బీజేపీతో కలిసి ఎందుకు వెళ్ళకూడదు. రాష్ట్రాభివృద్ధే అజెండాగా చేసుకున్నప్పుడు ఎవరితో కలిసినా తప్పులేదని అన్నారు. 

ట్విట్టర్ లో ప్రమాణస్వీకారం తాలూకు ఫోటోలను జతపరచి.. ఎన్సీపీ సన్నిహితులు, మహారాష్ట్ర ప్రజాభీష్టం మేరకు నేను ఈరోజున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ పదవి ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  

    

ఇది కూడా చదవండి: అత్త చేసిన పనికి బిత్తరపోయిన అల్లుడు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement