అమిత్‌ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ Election Commission Letter To Jairam Ramesh | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ

Published Sun, Jun 2 2024 8:45 PM | Last Updated on Sun, Jun 2 2024 8:45 PM

Election Commission Letter To Jairam Ramesh

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం(జూన్‌2) కోరింది.  ఈ మేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది. ఎన్నికల కౌంటింగ్‌పై  అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్‌ చేశారని జైరాం రమేష్‌ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.

మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని, వాటిపై విచారణ జరిపేందుకు  ఆధారాలుంటే సమర్పించండని ఈసీ జైరామ్‌రమేశ్‌ను కోరింది. ఆధారాలు చూపితే తగిన చర్యలు తీసుకుంటామని రమేష్‌కు ఈసీ లేఖలో తెలిపింది.  

హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై  బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా తెలుస్తోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని జైరాం రమేష్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement