Bheemili : యుద్ధానికి YSRCP సిద్ధం | AP CM YS Jagan YSRCP SIDDHAM Election Campaign Program At Visakhapatnam Today Updates In Telugu - Sakshi
Sakshi News home page

Vizag Bheemili : యుద్ధానికి YSRCP సిద్ధం

Published Sat, Jan 27 2024 11:22 AM | Last Updated on Sun, Feb 11 2024 3:02 PM

CM YS Jagan YSRCP Siddham Election Campaign Program At Visaka Updates - Sakshi

సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు
5.45pm, జనవరి 27, 2024

  • భీమిలిలో అటు సముద్రం ... ఇటు జనసముద్రం కనిపిస్తోంది
  • కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది
  • అటు కౌరవ సైన్యం ఉంది .. గజ దొంగల ముఠా ఉంది
  • ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు .. అర్జునుడు

175కు 175

  • ఈ యుద్ధంలో 175 కు 175 సీట్లు గెలుపే మన లక్ష్యం
  • ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే
  • మరో 25 ఏళ్ల పాటు మన జైత్రయాత్ర కు శ్రీకారం చుడుతున్నాం
  • మన మేనిఫెస్టో లో 99 శాతం హామీలను నెరవేర్చాం
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
  • అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు
  • గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీ కి రావు
  • 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు

మంచి చేసాం.. ఓట్లు అడుగుతున్నాం

  • చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు
  • మరో 75 రోజుల్లోనే ఎన్నికలు
  • అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది
  • గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు
  • మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం
  • ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు
  • ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు
  • 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం
  • లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం
  • ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం
  • రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం
  • ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం
  • నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం
  • దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం
  • ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం

ఇదీ వెన్నుపోటు బాబు పాలనకు, రాజన్న రాజ్యానికి తేడా

  • 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు
  • ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి
  • చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు
  • సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే
  • రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే
  • రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు
  • మీ జగన్ ... రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు
  • 3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం
  • ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం
  • అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది
  • విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం

పదవుల్లో, అధికారంలో పెద్దపీట

  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం
  • నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం
  • స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం
  • లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం
  • పేదల సొంతింటి కలను నెరవేర్చాం
  • అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది
  • 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం
  • డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు
  • అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది
  • ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు
  • బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు  
  • మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు
  • సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే
  • రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే

మీ ఖాతాను అడగండి చెబుతుంది

  • గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి
  • చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?
  • మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం
  • ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం
  • మీ జగన్ .. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు
  • 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం
  • కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి
  • మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే

ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు

  • పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి
  • ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి
  • ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే ... జగన్ గెలవాలని చెప్పండి
  • పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి
  • రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి
  • మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి
  • ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి
  • మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం .. మోసాలు చేయడం తెలియదు

మీ బిడ్డ చెప్పాడంటే .. చేస్తాడంతే

  • ఈ యుద్దానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ?
  • ఒంటరి పోరాటానికి నేను సిద్ధం .. మీరు సిద్ధమా ?
  • దుష్టచతుష్టయాన్ని ..గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా ?
  • వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే
  • ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి
  • దుష్టచతుష్టయం సోషల్ మీడియా లో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
  • మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే

Updates..

సంగివలసలో సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావం

  • మీరు వేసే ఓటు .. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి 
  • ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి 
  • మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు
  • మీ బిడ్డ చెప్పాడంటే... చేస్తాడంతే

  • ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?:
  • ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
  • దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?
  • వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే
  • ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి
  •  దుష్టచతుష్టయం సోషల్‌ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • మన టార్గెట్‌ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే
  • ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించండి
  • అలా చేస్తే మళ్లీ లంచాలు, వివక్ష కల్గిన జన్మభూమి కమిటీలకు ఆమోదం తెలిపినట్లే
  • పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు
  • వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి
  • ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయి.

  • కార్యకర్తలు.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి
  • పేదల భవిష్యత్‌ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి
  • ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్‌ గెలవాలని చెప్పండి
  • ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్‌ రావాలంటే.. జగన్‌ గెలవాలని చెప్పండి
  • పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్‌ సీఎం అవ్వాలని చెప్పండి
  • మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే
  • ప్రజలే.. నా స్టార్‌ క్యాంపెయినర్లు

  • 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో మీ బ్యాంక్‌ అకౌంట్‌లు చూస్తే అర్ధమవుతుంది
  • ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా అని వారినే అడగండి
  • మళ్లీ అడగండి.. 2019 నుంచి 2024 వరకూ మీ జగన్‌ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి
  •  రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం
  • కోవిడ్‌ కష్టకాలంలో సాకులు వెతుక్కోలేదు
  • కోవిడ్‌ కష్టాలు ఎన్నొచ్చినా, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు.. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ ప్రభుత్వమని అందరికీ చెప్పండి
  • వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్జీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పోరేటర్లు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా
  • ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్‌ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ
  • వైఎస్సార్‌సీపీలో ఉన్నవారు..  వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడ్డవారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం  ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది  వైఎస్సార్‌సీపీనే
  • 58 నెల కాలంలో ప్రతీ ఇంటికి మంచి చేయగలిగాం

  • పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా
  • పేద వర్గాలు కనిపిస్తే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలా అంటాడు
  • ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే  గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎవరైనా పట్టించుకుంటారా?
  • బీసీలు తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్‌ అంటాడు చంద్రబాబు.. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా?
  • అసలు ఎక్కడ ఉంది.. చంద్రబాబుకు సామాజిక వర్గాలపై ప్రేమ
  • అసలు ఎక్కడ ఉంది.. పేద సామాజిక వర్గాల  అభ్యున్నతిలో చంద్రబాబు మార్క్‌
  • డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేశాడు
  • అక్కా చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది
  • 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం

  • లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం
  • ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం
  • రైతులకు తోడుగా ఆర్‌బీకేలను నిర్మించాం
  • ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట​్‌ తీసుకొచ్చాం
  • నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం
  • దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం
  • ప్రతి గ్రామానికి డిజిటల్‌ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చాం
  • 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు
  • ఎందుకంటే చంద్రబాబు అండ్‌ కో పెత్తందార్లు కాబట్టి
  • సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే
  • రైతులకు ఉచిత విద్యుత్‌, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే
  • రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు
  • మీ జగన్‌.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు
  • విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • పేద పిల్లలకు ఇంగ్లిష్‌ చదువును అందుబాటులోకి తెచ్చాం
  • ఏ రంగంలో చూసినా వైఎస్‌జగన్‌ మార్కే కనిపిస్తోంది
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం
  • నామినేటెడ్‌ పదవుల్లో సగం పదవులు బలహీన వర్గాలకే ఇచ్చాం
  • స్థానిక సంస్థల పదవులు అన్నింటిలోను సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం
  • 3,257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరించాం
  • ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు
  • నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం
  • అందుకే ఎక్కడ చూసినా వైఎస్‌ జగన్‌ మార్కే కనిపిస్తోంది

  • భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది
  • ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు
  • ఇటు పక్క పాండవ సైన్యం ఉంది
  • అటు పక్క కౌరవ సైన్యం ఉంది
  • అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది
  • ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు..ఇక్కడ ఉన్నది అర్జునుడు
  • ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు
  • ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే
  • మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
  • అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు
  • గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు
  • మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం
  • పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా
  • 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది
  • ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను
  • ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి
  • ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది
  • ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది
  • మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు
  • మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం
  • చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు
  • మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం
  • ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు
  • ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు
  • 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం

3:40PM, Jan 27, 2024

సంగివలస చేరుకున్న సీఎం జగన్‌

  • సంగివలస సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్
  • భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ
  • ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్‌
  • ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

3:30PM, Jan 27, 2024

 పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ నెరవేర్చారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • సీఎం జగన్‌ పాలనలో కార్యకర్తలకు గౌరవం పెరిగింది
  • చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలి
  • కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించాం

3:23PM, Jan 27, 2024

విశాఖ చేరుకున్న సీఎం జగన్‌

  • భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ
  • ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్‌
  • 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం

విశాఖ బయల్దేరిన సీఎం జగన్‌
►కాసేపట్లో భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభ
►ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్‌
►టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం
►34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
►175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యం

►రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. 

వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సాంగ్‌..

►ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు.

►ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ­లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

►సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. 

►సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్‌ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు  సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసా­గిస్తున్నారు.  

సీఎం జగన్‌ పర్యటన ఇలా.. 
►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్‌లో విశాఖ  ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు.  

బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. 
►మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్‌ వంగపండు ఉష పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement