గవర్నర్‌.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ | Cm Mamata Banerjee Comments On West Bengal Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ

Published Sat, May 11 2024 5:34 PM | Last Updated on Sat, May 11 2024 6:03 PM

Cm Mamata Banerjee Comments On West Bengal Governor

కోల్‌కతా: గవర్నర్‌ బోస్‌ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్‌బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగిపై గవర్నర్‌ లైంగిక వేధింపులకు పాల్పడడంపై  శనివారం సప్తగ్రామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. 

బోస్‌ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్‌ అంటున్నారు. కానీ గవర్నర్‌ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్‌ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్‌ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement