ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక Bypoll for two MLC seats under MLAs quota on July 12: AP | Sakshi
Sakshi News home page

ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక

Published Wed, Jun 19 2024 5:40 AM | Last Updated on Wed, Jun 19 2024 6:00 AM

Bypoll for two MLC seats under MLAs quota on July 12: AP

దేశంలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు 

ఈ నెల 25న నోటిఫికేషన్‌

షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానా­నికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అన­ర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వ­హించనున్నట్లు తెలిపింది.

ఏపీలో సి.రామ­చంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్య­మైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement