BJP Raghunandan Rao Complains To ED About Sukesh Chandra WhatsApp Chat - Sakshi
Sakshi News home page

రంగంలోకి ఎమ్మెల్యే రఘునందన్‌.. ఆ రేంజ్‌ రోవర్‌ కారు ఎవరిది?

Published Wed, Apr 12 2023 6:05 PM | Last Updated on Wed, Apr 12 2023 6:22 PM

BJP Raghunandan Rao Complains To ED About Sukesh Chandra WhatsApp Chat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేష్‌ చంద్ర లిక్కర్‌ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. 

ఈ క్రమంలోనే కవితతో తాను చేసిన వాట్సాప్‌ చాటింగ్‌ను బయటపెట్టాడు. ఈ సందర్బంగా లిక్కర్‌ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్‌ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లిక్కర్‌ స్కాం కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌ రావు రంగంలోకి దిగారు. దీంతో, రఘనందన్‌ రావు తాజాగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుఖేష్‌ చంద్ర లేఖపై ఈడీకి ఫిర్యాదు చేశారు రఘనందన్‌. 

ఈ సందర్భంగా రఘనందన్‌ మాట్లాడుతూ.. కవిత, సుఖేష్‌ చంద్ర వాట్సాప్‌ చాటింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. సుఖేష్‌ వాట్సాప్‌ చాట్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్టు సంభాషణ ఉంది. నగదు ఉంచిన 6060 నెంబర్‌ రేంజ్‌ రోవర్‌ కారు ఎవరిది? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ పోలీసులు మౌనం వీడాలి. తెలంగాణ భవన్‌లో మనీలాండరింగ్‌ జరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement