కార్మిక హక్కులు కాలరాస్తున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులు కాలరాస్తున్న బీజేపీ

Published Sat, Apr 20 2024 1:20 AM | Last Updated on Sat, Apr 20 2024 1:20 AM

మాట్లాడుతున్న శ్రీనివాస్‌ - Sakshi

● ఐఎప్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ విమర్శించారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజా, కార్మిక. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతోనే గత అసెంబ్లీలో ఓటమి పాలైందని గుర్తుచేశారు. గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి రాజయ్య, ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు ఇ.నరేశ్‌, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, నాయకులు రాజనర్సు, రమేశ్‌, వెంకటస్వామి తదితతరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement