హ్యాట్రిక్‌ సాధిస్తా | - | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ సాధిస్తా

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

● అభివృద్ధి, సంక్షేమమే విజయానికి శ్రీరామరక్ష ● వైఎస్సార్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి

సాక్షి: మీ కృషితో మంజూరైన కురుపాంలోని గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల పనులు ఎంత వరకు వచ్చాయి? ఈ కళాశాల ఏర్పాటు వల్ల ఏ మేరకు ఉపయోగం ఉంటుంది?

జవాబు: కురుపాం చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలను 105 ఎకరాల విస్తీర్ణంలో రూ.190 కోట్ల అంచనా విలువతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కళాశాల నిర్మాణం పూర్తయితే పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్న కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది.

సాక్షి: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మీ ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?

జవాబు: నియోజకవర్గంలో ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తున్నాం. ప్రచారం ఎంతో బాగా జరుగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం తమ ప్రభుత్వంపైన ఉన్న నమ్మకం, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.

కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి

సాక్షి: నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటి?

జవాబు: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు సమస్యలకు పరిష్కారం చూపించాను. రూ.1,045 కోట్లతో గిరిజన సంక్షేమ, పంచాయతీరా జ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖల ద్వారా రహదా రులు, తాగునీరు, నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధి, సుందరీకరణ, ఆస్పత్రులకు అదనపు గదుల నిర్మాణం, మెరుగైన వైద్యసేవలు అందేలా పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకం చేపట్టాం. సంక్షేమ పథకాల మంజూ రులో పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఐదేళ్ల పాలనలో రూ.1700 కోట్లు జమచేశాం.

సాక్షి: వైఎస్సార్‌సీపి ప్రభుత్వ హయాంలో గిరిజన రైతులకు ఏ మేరకు మేలు జరిగింది.

జవాబు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన రైతులు పోడు భూములపై సాగు మాత్రమే చేసుకునే వారు. వారికి ఎటువంటి హక్కు పత్రాలు ఉండేవి కావు. అయితే వైఎస్సార్‌సీపి ప్రభుత్వం వచ్చిన తరువాత కురుపాం నియోజకవర్గంలో 32,300 మందికి 68,811.78 ఎకరాలకు సంబంధించి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, డీకేటి పట్టాలను అందజేశాం. అంతేకాకుండా వారందరికీ ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ము అందుతుండడంతో సంతోషంగా ఉన్నారు.

సాక్షి: నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలేమిటి?

జవాబు: కొమరాడ మండలంలోని పూర్ణపాడు–లాభేసుపై వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం అరకొరగా నిధులు మంజూరు చేసిన కారణంగా వంతెన నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కొత్తరేట్లకనుగుణంగా మరో రూ.7 కోట్లు టీఎస్పీ గ్రాంట్‌ మంజూరు చేసింది. మొత్తం రూ.14 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. అలాగే 1976వ సంవత్సరం నుంచి అభివృద్ధికి నోచుకోని జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ జలాశయం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఈ జలాశయం వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరుగుతుంది.

ఈ నేపథ్యంలో జైకా నిధులు రూ.44.85 కోట్లతో పనులు జరిగేలా చర్యలు చేపడుతున్నాం.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కురుపాం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే నియోజకవర్గం ప్రజలు తనపట్ల

చూపిస్తున్న అంతులేని ప్రేమాభిమానాలకు కారణమని వైఎస్సార్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గానికి తాను అందజేసిన అభివృద్ధి, సంక్షేమఫలాలే వారధిగా నిలుస్తాయని ధీమాగా చెబుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీ హయాంలో నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని (రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం విషయంలో) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో చేసి నియోజకవర్గ ప్రజల

కళ్లముందు ఉంచి వారి ఆదరాభిమానాలు చూరగొన్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు

గురువారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలిలా ఉన్నాయి. –కురుపాం

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement