కళావతి ప్రచార జోరు | - | Sakshi
Sakshi News home page

కళావతి ప్రచార జోరు

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని ఇంటింట ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి - Sakshi

పాలకొండ:

న్నికల ప్రచారానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి జనం నీరాజనం పడుతున్నారు. ప్రచారం చేస్తున్న ఆమెకు మహిళలు హారతి వచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు 15,16,17,18 వార్డుల పరిధిలోని గారమ్మ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. కాలనీలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి సీఎం జగన్‌మోహరెడ్డి అందించిన సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పలు వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. వీధుల్లో ప్రచారం నిర్వహించిన ఆమెకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు ప్రచారంలో పార్టీ నాయకులు వెలమల మన్మథరావు, దుప్పాడ పాపినాయుడు, వై లిల్లీపుష్పనాథం కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, కొంచాడ అరుణ్‌కుమార్‌, తూముల లక్ష్మణరావు, పల్లా భాను, కిల్లారి మోహన్‌, బాసూరు కాంతారావు, కొడెం విజయకుమార్‌, కొరికాన గంగునాయుడు, కోరాడ సూర్యనారాయణబాబు, కోరాడ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement