US: టెక్సాస్‌ హ్యుస్టన్‌లో మేమంతా సిద్ధం! | YSRCP Cadre Says Memantha Sidham In Texas Houston In US, Details Inside - Sakshi
Sakshi News home page

టెక్సాస్‌ హ్యుస్టన్‌లో మేమంతా సిద్ధం!

Published Tue, Apr 23 2024 12:51 PM | Last Updated on Tue, Apr 23 2024 1:13 PM

YSRCP Cadre Says Memantha Sidham  In Texas Houston In US - Sakshi

సీఎం జగన్‌కు మద్ధతుగా టెక్సాస్‌ హ్యుస్టన్‌లో ర్యాలీ

ఘనంగా సంఘీభావ సభ

మళ్లీ సీఎంగా జగన్‌ ఎన్నికవుతారంటూ ప్రచారం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్‌లోని హ్యుస్టన్‌ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ హ్యుస్టన్‌ నాయకులు బ్రహ్మనంద రెడ్డి , మారుతి , పుల్లా రెడ్డి , శ్రీనివాస్ ఎర్రబోతుల ,యాదగిరి రెడ్డి కుడుముల, విశ్వ సానపరెడ్డి, నర్సి రెడ్డి మరియు దాదాపు 90 మంది వైఎస్సార్‌సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కిలారి రోశయ్య , ఎంపీ అయోధ్య రామి రెడ్డి మరియు పండుగాయల రత్నాకర్ గారు జాయిన్ అయ్యి ప్రసంగించారు.

బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగినందుకుగాను జగన్ గారి మేమంత సిద్ధం బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ తదితర ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే అన్నారు.

మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 వైస్సార్సీపీ ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక శ్రీనివాస్ ఎర్రబోతుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 17 మెడి­కల్‌ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనా­లు, విలేజ్‌ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్‌ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, విద్యార్థులకు ట్యాబ్స్‌ వంటివి అద్భుతాలు అన్నారు.

తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో నాడు–నేడు ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల రూపు రేఖలే మారాయన్నారు. మారుతి మాట్లాడుతూ.. జగన్ అన్న ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు. పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా ఆయనే స్యయంగా జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే కదా అన్నారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేద ప్రజల కోసం అమ్మఒడి , జగన్ అన్న విద్యా కానుక, గోరు ముద్ద, సచివాలయ వ్యవస్థ, పోర్టులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలు వైస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు .

(చదవండి: ఎన్నికల తర్వాత బాబు, లోకేష్‌ ఎన్‌ఆర్‌ఐలే అవుతారు: రత్నాకర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement