అమెరికాలో తెలుగు పద్య వైభవ సదస్సు | TANA PSV Organized Telugu Padya Vaibhavam Conference In Dallas | Sakshi
Sakshi News home page

తానా ఆధ్వర్యంలో తెలుగు పద్య వైభవ సదస్సు

Published Wed, Dec 2 2020 9:03 PM | Last Updated on Thu, Dec 3 2020 3:19 PM

TANA PSV Organized Telugu Padya Vaibhavam Conference In Dallas - Sakshi

డల్లాస్‌‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలోనవంబర్ 29న అంతర్జాతీయ దృశ్య సమావేశంలో జరిగిన ‘తెలుగు పద్య వైభవ’ సదస్సు అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషకు నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన, వేమన, బద్దెన, రామదాసు వంటి అనేక మంది కవులు వన్నె తెచ్చారని, వారంత అద్భుతమైన పద్యాలు రచించి యతి, ప్రాసలతో సశాస్త్రీయమైన ప్రణాళికతో, ఛందస్సుతో, రచింపబడే పద్య ప్రక్రియ ఎంతో గొప్ప రచించారన్నారు.  అయితే కేవలం తెలుగు భాషలోనే ఈ అద్భుత పద్య ప్రక్రియ ఉందన్న విషయాన్ని పరిరక్షించాల్సిన అవసరం అందరిమీద ఉందన్నారు.

ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావును తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. అనంతరం డా. గరికిపాటి ప్రసంగాలన్నీ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలే అనుకుంటే పొరపాటేనన్నారు. అయన ప్రసంగాలలో మానవ విలువల పరిరక్షణ, సామాజిక బాధ్యత గుర్తు చేసే అంశాలతో పాటు మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు, పక్క దారి పడుతున్న యువత, అజ్ఞానం, అంధ విశ్వాసాలు, మూఢా నమ్మకాలలో కొట్టు మిట్టాడుతున్న అమాయక ప్రజలకు వేద విజ్ఞాన మదింపు, శాస్త్ర విజ్ఞాన జోడింపుతో కూడిన ఆయన ప్రసంగాలు మానవాళికి మేలుకొలుపులన్నారు.

ఇక గరికిపాటి నరసింహారావు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ అనేది ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలని, తల్లిదండ్రులు తెలుగులో తమ బిడ్డలతో సంభాషించాలని పిలుపు నిచ్చారు. అప్పుడే తెలుగు భాష పరిరక్షించబడుతుందని, ఆంగ్ల వాతావరణం ఉండే అమెరికాలోని పిల్లలు శ్ర్రావ్యంగా పద్యాలు పాడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. "మహా భారతంలో నన్నయ్య రచించిన శకుంతల దుష్యంతుడు వృత్తాంతం నుంచి నేటి స్త్రీలు ధైర్యాన్ని నేర్చుకోవాలని, నూతులు తవ్వడం కన్నా, బావులు తవ్వించడం కన్నా, యజ్ఞాలు చేయడం కన్నా, పుత్రులను కనడం కన్నా, సత్యం మీద నిలబడటం గొప్ప విషయం అనే సందేశం అద్భుతంగా ఆవృత్తాంతంలో ఆవిష్కరించబడింది అన్నారు. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, బమ్మెర పోతన, శ్రీనాధుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఎన్నో పద్యాలను ఉటంకిస్తూ సామాజిక చైతన్యం కలిగించే విధంగా విశ్లేషించారు.

ఈ కార్యక్రమంలో అమెరికాలోని తెలుగు రామాచారి శిష్యులైన.. రాహుల్ శిస్టా, సియాటెల్, వాషింగ్టన్; అనన్య రాయపరాజు, బ్రిడ్జి వాటర్, న్యూ జెర్సీ; భావన నాగోటి, డౌనింగ్ టౌన్, పెన్సిల్వేనియా; శ్రీజ బొడ్డు, న్యూ జెర్సీ; సృష్టి చిల్ల, న్యూ జెర్సీ; శర్వాణి సాయి గండ్లూరి, డల్లాస్, టెక్సాస్; మల్లిక సూర్యదేవర, డల్లాస్, టెక్సాస్; శ్రీతన్ పిట్టల, నువర్క్, డెల్ వేర్; శ్రియ పిట్టల, నువర్క్, డెల్ వేర్; అభిజ్న యనగంటి, యాష్ బర్న్, వర్జీనియా; శ్రియ నందగిరి, బ్లైనా, మిన్నెసోట; ప్రణవ్ అర్కటాల, అట్లాంటా, జార్జియా; శృతి నాగులపల్లి, శాన్ హోజే, కాలిఫోర్నియా; వర్ష జనుంపల్లి, ఫ్రిస్కో, టెక్సాస్; లయ నీలిసెట్టి, న్యూ జెర్సీ; ఆరుషి రామక, న్యూ జెర్సీ; సాయి తన్మయి ఇయ్యున్ని, డల్లాస్, టెక్సాస్, శరణ్య వక్కలంక, వర్జీనియాలు దాశరధి, వేమన, సుమతీ శతక పద్యాలను పాడారు.

అంతేగాక పార్థు శిష్యులు.. మేధా అనంతుని, ఆస్టిన్, టెక్సాస్; వేదాంత్ అత్తిలి, బెంటన్ విల్, ఆర్కేన్సా; మేధా నేమాని, శాన్ హోజే, కాలిఫోర్నియా; శ్రియా చెముడుపాటి, రిచ్ మాండ్, వర్జీనియా; సంహిత పొన్నపల్లి, హూస్టన్, టెక్సాస్; భార్గవ్ నేమాని, శాన్ హోజే, కాలిఫోర్నియా; శ్రీవల్లభ కొమండూరు, న్యూ జెర్సీ మరియు శ్రీవల్లి కొమండూరు, న్యూ జెర్సీ. గుమ్మడి గోపాలకృష్ణ గారి శిష్యులు పౌరాణిక పద్యాలను రాగయుక్తం గా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఆముక్త శ్రీనాగ దాసరి, కేరి, నార్త్ కరోలినా; కార్తిక్ దూసి, పొకేప్సి, న్యూయార్క్; శౌర్య మంత్రాల, కేరి, నార్త్ కరోలినా; శశాంక్ మంత్రాల, కేరి, నార్త్ కరోలినా; స్రవంతి మానికొండ, ప్లేన్స్ బొరో, న్యూ జెర్సీ మరియు శ్రీహిత ఎలమంచిలి, ఆపెక్స్, నార్త్ కరోలినా ఇటీవల జరిగిన తానా బాలోత్సవం లో పాల్గొని విజేతలైన రిషికా గోటేటి, న్యూ జెర్సీ; హన్సిత చెంచల, ఫ్లోరిడా; రిషికేశ్ ముద్దన, మారల్టన్, న్యూ జెర్సీలు కూడా పాల్గొని భాగవత పద్యాలను వినిపించారు. చివరగా తానా ఫౌండేషన్ కోశాధికారి జగదీశ్ ప్రభల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన సుమంత్ రామిశెట్టి, శ్రీధర్ చిల్లర, ప్రశాంత్ కొల్లిపర, పురుషోత్తం నార్గౌని గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని విద్యార్ధులకు అద్భుత శిక్షణ ఇచ్చి మంచి గాయనీ గాయకులుగా తీర్చి దిద్దుతున్న రామాచారి, పార్థు, గుమ్మడి గార్లకు, పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు పత్యేక కృతజ్ఞతలను తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement