Wrestlers asked for proof to back allegations against WFI chief - Sakshi
Sakshi News home page

వీడియో, ఆడియో, వాట్సాప్ చాటింగ్ ఆధారాలుంటే చూపించండి... 

Published Sun, Jun 11 2023 10:24 AM | Last Updated on Sun, Jun 11 2023 12:51 PM

Wrestlers Asked For Proof On Allegations Against WFI Chief  - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్  సింగ్ పై లైంగిక అఆరోపణలు చేస్తూ కన్నాట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లకు సమన్లు పంపించారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఆరోపణలు చేసినదాని ప్రకారం వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోటోలు, బెదిరింపు సందేశాలు వంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే స్టేషన్లో పొందుపరచాలని కోరింది.    

ఫిర్యాదు ప్రకారమే సమన్లు.. 
ఏప్రిల్ 21న భారత మహిళా రెజ్లర్లు ఇద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్  సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, ఊపిరి చెక్ చేస్తానంటూ ఇష్టానుసారంగా మీద చేతులు వేస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కన్నాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు తర్వాత ఈ కేసులో సత్వర విచారణ చేసి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని భారత్ ప్రఖ్యాత రెజ్లర్లు నిరసన తెలుపుతోన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది.  

సాక్ష్యాలున్నాయా?
తాజాగా కన్నాట్ పోలీసులు కంప్లైంట్లో వారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తమపై చేతులు వేసినట్టుగా కానీ, తమను ముట్టుకుంటున్నట్టుగా కానీ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ సందేశాలు ఏమైనా ఉంటే తమకివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం  
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతకాలు చేసిన నోటీసులను పంపించారు.      

ఇది కూడా చదవండి: ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement