ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ | UGC warns edtech companies offering degree courses | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ

Published Sun, Dec 17 2023 6:21 AM | Last Updated on Sun, Dec 17 2023 6:21 AM

UGC warns edtech companies offering degree courses - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్‌టెక్‌ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది.

విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్‌ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement