జమ్ము కశ్మీర్‌: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి Terrorist deceased in encounter with security forces in Kashmir Bandipora district | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి

Published Mon, Jun 17 2024 8:48 AM

Terrorist deceased in encounter with security forces in Kashmir Bandipora district

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఆదివారం రాత్రి ఉత్తర కశ్మీర్‌ బండిపోరా జిల్లాలోని ఆరాగం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో  ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరాగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందటంతో  భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో  ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్‌ సాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగిన రోజే ఈ ఘటన చేటుచేసుకుంది. 

అమిత్‌ షా.. కశ్మీర్‌లో చెలరేగుతున్న ఉగ్రవాదం ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మీటింగ్‌లోని అధికారులను ఆదేశించారు. ఇటీవల జమ్ము కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడుల పరిస్థితులను పరిశీలించడానికి ఇవాళ(సోమవారం) చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్ పర్యటించనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement