కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య | Terror Attack On Pilgrims In J And K PM Modi Assures All Help Leaders Condemn, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Terror Attack In Kashmir: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య

Published Mon, Jun 10 2024 7:27 AM | Last Updated on Mon, Jun 10 2024 10:09 AM

Terror Attack On Pilgrims In J and K PM Modi Assures All Help Leaders Condemn

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉ‍న్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. 

నిందితుల కోసం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌​ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్‌, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉ‍న్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో  ఉగ్రవాదులను గాలిస్తున్నారు. 

జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్‌ ఖోరి నుంచి కాట్రాలోని  మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

రాజౌరి, పూంచ్‌, రియాసి ప్రాంతాల్లో దాగి ఉ‍న్న ఉగ్రవాదులపై  వేట కోసం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌​ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన  జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్  మనోజ్‌  సిన్హా ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.

‘ప్రధాని మోదీ  దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను  ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ  ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి  మెడికల్‌ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.

దాడిపై స్పందించిన రాష్ట్రపతి
‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది.  ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’  అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.

 

కేంద్రమంత్రి అమిత్‌ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా  ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్‌ షా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

ఉగ్రవాద దాడి  పరికిపంద చర్య అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన.  ఈ దాడితో జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని  ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.

యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement