భానుడి భగభగలు: ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు | Temperature of Transformer Becomes hot Shocked after Knowing Temperature | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలు: ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు

Published Tue, May 28 2024 1:49 PM | Last Updated on Tue, May 28 2024 1:49 PM

Temperature of Transformer Becomes hot Shocked after Knowing Temperature

ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి.

పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్‌ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్‌ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.

సాధారణంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అయితే వేడి కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఆయిల్ వేడెక్కితే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే ట్రిప్పింగ్  జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహించడానికి వాటి మందు కూలర్లు  ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement