Jammu Kashmir: 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌కు శుభవార్త, రాష్ట్ర హోదా..? | SC Asks Centre Timeframe Make Jammu kashmir State Again | Sakshi
Sakshi News home page

Jammu Kashmir: 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌కు శుభవార్త, రాష్ట్ర హోదా..?

Published Tue, Aug 29 2023 2:12 PM | Last Updated on Tue, Aug 29 2023 4:01 PM

SC Asks Centre Timeframe Make Jammu kashmir State Again - Sakshi

ఢిల్లీ:జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర హోదా కల్పించడంపై మరో రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని కోరింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. 

సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందంటే :
"కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు. ఎల్లుండి (సెప్టెంబర్ 1 2023న) కేంద్రం ఒక ప్రకటన చేయనుంది. ఇది జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. ఇక ముందు కూడా లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. లఢక్ లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒకటి లేహ్.. మరొకటి కార్గిల్. లేహ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. కార్గిల్ లో సెప్టెంబర్ లో ముగుస్తాయి" అని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. 

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉందని చెప్పారు. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాక ఆ ప్రయత్నాలు మొదలవుతాయని ధర్మాసనానికి విన్నవించారు. 

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.    

ఇదీ చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సీజేఐ చంద్రచూడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement