Why Red Honey Is More Intoxicating Than Alcohol, A Lot Of Demand In Worldwide - Sakshi
Sakshi News home page

Why More Demand For Red Honey: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..

Published Wed, Jul 12 2023 11:23 AM | Last Updated on Wed, Jul 12 2023 12:52 PM

red honey is more intoxicating than alcohol - Sakshi

తేనె గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. తేనె పలు వ్యాధులను కూడా దూరం చేస్తుందని చెబుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఎర్ర తేనె గురించి విన్నారా? ఇది ఎంతో మత్తును కలిగిస్తుంది. పెద్ద తేనె టీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగలను ‘హిమాలయన్‌ క్లిఫ్‌ బీస్‌’ అని అంటారు.  ఈ తేనెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎర్ర తేనెను ఉత్పత్తి చేసేందుకు ‘హిమాలయన్‌ క్లిఫ్‌ బీస్‌’ విషపూరితమైన పండ్ల రసాన్ని సేకరిస్తాయి. ఈ తేనె ఎంతో మత్తునిస్తుంది. దీనిలో పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్ర తేనెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. ఈ తేనె తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెబుతారు. డయాబెటీస్‌తో పాటు హైబ్లడ్‌ ప్రజర్‌ను ఇది తగ్గిస్తుందని చెబుతారు. ఇది అందించే మత్తు కారణంగా దీనికి అత్యధిక డిమాండ్‌ ఏర్పడిందని అంటారు. 

ఎర్ర తేనె నేపాల్‌ శివారు ప్రాంతాలలో లభ్యమవుతుంది. కాగా ఈ తెనె తీయడం ఎంతో ప్రమాదకరమని చెబుతారు. సాధారణ తీసే విధానం కన్నా ఇది ఎంతో కష్టమైనది. ఎ‍ర్ర తేనెను గురూంగా గిరిజన జాతివారు ఎంతో చాకచక్యంగా సేకరిస్తుంటారు. ఈ తేనె సేకరించేందుకు ముందుగా ఒక తాడు సహాయంతో ఎన్నో అడుగుల ఎత్తయిన ప్రాంతానికి చేరుకుంటారు. తరువాత పొగ సాయంతో తేనేటీగలను తరిమికొడతారు. ఈ నేపధ్యంలో తేనె సేకరించేవారు తేనెటీగల దాడికి కూడా బలవుతుంటారు. 

ఎర్ర తేనె అత్యధిక మత్తు కలిగిన ఎస్బింథే లాంటిది. ఎస్బింథే వినియోగంపై పలు దేశాల్లో నిషేధం ఉంది. ఎరుపు తేనెను అధికమోతాదులో తీసుకుంటే హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ 1.40 లక్షలకు టోకరా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement