ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | Pune To Delhi Flight Makes Emergency Landing In Mumbai After Bomb Claim Turned Out To Be A Hoax - Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Published Sat, Oct 21 2023 1:14 PM | Last Updated on Sat, Oct 21 2023 1:42 PM

Pune Delhi Flight Makes Emergency Landing In Mumbai Over Bomb Hoax - Sakshi

ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. 

వివరాలు.. ఆకాశ ఎయిర్‌ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్‌లో బాంబ్‌ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన  సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు.

బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.  అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాంబు  లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్‌ అయ్యింది.
చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement