పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’ Pune car crash: Police submit final report to JJB, to try minor as an adult. Sakshi
Sakshi News home page

పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’

Published Wed, Jun 19 2024 8:09 AM | Last Updated on Wed, Jun 19 2024 9:40 AM

Pune car crash: Police submits final report to JJB try minor  as adult

ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్‌ పోలీసులు జేజేబీకి అందజేశారు.  

చదవండి: రీల్‌ను మించిన రియల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ఇవేం ట్విస్టులు బాబోయ్‌!

‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్‌ బాలుడే కీలకంగా ఉ‍న్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం.  ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్‌మెంట్ తీసుకున్నాం. మైనర్‌ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. 

విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్‌ బాలుడే.  ఇలా.. మైనర్‌ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్‌ అధికారి కోరారు.

ఈ కేసులో మైనర్‌ బాలుడి బ్లడ్‌ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్‌ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్‌ చేయగా జైలులో ఉ‍న్నారు. బ్లడ్‌ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్‌ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

చదవండి:  పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement