‘పిల్‌’లతో కాలహరణం: సుప్రీంకోర్టు | PIL Business Stealing Attention From Important Matters | Sakshi
Sakshi News home page

‘పిల్‌’లతో కాలహరణం: సుప్రీంకోర్టు

Published Tue, Feb 22 2022 5:11 AM | Last Updated on Tue, Feb 22 2022 8:23 AM

PIL Business Stealing Attention From Important Matters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్‌)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్‌ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్‌ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్‌లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్‌ ఏఎం ఖని్వల్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement