Poet Muhammad Allama Iqbal, Who Wrote 'Saare Jahan Se Achha' Dropped From Syllabus - Sakshi
Sakshi News home page

'సారే జహాన్‌ సే అచ్ఛా'రాసిన కవి గూర్చి సిలబస్‌ నుంచి తొలగింపు

Published Sat, May 27 2023 9:58 AM | Last Updated on Sat, May 27 2023 10:39 AM

Pak Poet Allama Iqbal Wrote Saare Jahan Se Achha Dropped From Syllabus - Sakshi

ప్రసిద్ధ గేయం 'సారే జహాన్‌ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్‌ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్‌​ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్‌ కౌన్సిల్‌ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్‌ విభజనకు ముందు ఉన్న సియోల్‌కోట్‌లో 1877లో జన్మించిన పాక్‌ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్‌ ఇక్బాల్‌ ఈ ప్రముఖ గేయం 'సార్‌ జహాన్‌ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్‌ సిలబస్‌ నుంచి తొలగించారు. 

దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్‌ సైన్స్‌ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్‌ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్‌ ఇండియన్‌ పొలిటికల్‌ థాట్‌' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్‌ పేపర్‌లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ.

ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్‌రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు.

సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్‌లో  ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్‌ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్‌ నుంచి తొలగించింది అకడమిక్‌ కౌన్సిల్‌. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్‌ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్‌ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది.

(చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్‌ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement