ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం! | Mysterious Boiling Water Coming Out Of Well | Sakshi
Sakshi News home page

ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!

Published Tue, Sep 19 2023 10:59 AM | Last Updated on Tue, Sep 19 2023 11:07 AM

Mysterious Boiling Water Coming out of Well - Sakshi

బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

భాగల్‌పూర్‌ జిల్లాలోని గోరాడీప్‌ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. 

గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ ఈ నీటిని డీటీఎస్‌ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. 
ఇది కూడా చదవండి: ఫిరోజ్‌ ఘంఢీ.. ఫిరోజ్‌ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement