Madhya Pradesh Man Gets Rs 14 000 Bill After Offer Lunch to Governor - Sakshi
Sakshi News home page

పేదోడి ఇంట్లో గవర్నర్‌ భోజనం.. ఆపై రూ.14 వేలు బిల్లు చేతిలో పెట్టారు!

Published Sun, Dec 26 2021 8:17 PM | Last Updated on Mon, Dec 27 2021 10:30 AM

Madhya Pradesh Man Gets Rs 14 000 Bill After Offer Lunch to Governor - Sakshi

Madhya Pradesh Man Gets Rs 14 000 Bill : మధ్యప్రదేశ్‌లోన విదిషా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివాసీ బుధ్రామ్‌ ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే అతనికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికారులు పక్కా ఇల్లు కట్టించారు. ఈ మేరకు గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటి తాళం చెవిని అందజేశారు. అంతేకాదు బుధ్రామ్‌తో కలిసి భోంచేశారు. గవర్నర్‌ తన ఇంట్లో భోజనం చేయడంతో బుధ్రామ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఒకటైతే.. గవర్నర్‌ వెళ్లిపోయాక కొంతమంది అధికారులు సదరు ఆదివాసీ చేతిలో రూ. 14వేల బిల్లు చేతిలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

(చదవండి:  పాములతో మ్యూజిక్‌ షూట్‌... షాకింగ్‌ వీడియో!)

వివరాల్లోకి వెళితే.. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్‌, ఫ్యాన్‌లను అమర్చారు. అయితే బుధ్రామ్‌ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు.  అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్‌ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్‌ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు.  ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు.

బుద్రామ్‌కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు.  కాగా, ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. దీనిపై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి భూపేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సదరు ఆదివాసీ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి చూసిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

(చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement