Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?! | Lok Sabha Elections 2024: Quality education, job opportunities and women security top the priorities of first-time voters in Himachal Pradesh | Sakshi
Sakshi News home page

Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!

Published Tue, May 28 2024 4:21 AM | Last Updated on Tue, May 28 2024 4:21 AM

Lok Sabha Elections 2024: Quality education, job opportunities and women security top the priorities of first-time voters in Himachal Pradesh

హిమాచల్‌లో తొలి ఓటర్ల డైలమా

విద్య, ఉద్యోగావకాశాలు, భద్రతే ప్రాథమ్యాలు

400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్‌ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్‌ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. 

నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్‌ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

ఉచితాలు అనుచితాలే...! 
కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. 

అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 

పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్‌. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థి రోహిత్‌ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! 
 

ఔత్సాహిక జర్నలిస్టు...
సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్‌ ఠాకూర్‌ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్‌ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్‌ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. 

‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్‌ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్‌ చెప్పుకొచి్చంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement