ఎస్‌టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన! Kurmi Tribe Protest Demanding Inclusion In ST List Trains Cancelled | Sakshi
Sakshi News home page

ఎస్‌టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!

Published Wed, Sep 21 2022 8:20 AM | Last Updated on Wed, Sep 21 2022 8:20 AM

Kurmi Tribe Protest Demanding Inclusion In ST List Trains Cancelled - Sakshi

కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్‌ తెగ(ఎస్‌టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో కూడా కుర్మీలు రైల్‌ రోకోలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జనరల్‌ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌: కేంద్రం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement