Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు Kerala Records 128 New Covid 19 Cases One Deceased | Sakshi
Sakshi News home page

Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు

Published Mon, Dec 25 2023 12:02 PM | Last Updated on Mon, Dec 25 2023 12:26 PM

Kerala Records 128 New Covid 19 Cases One Deceased - Sakshi

ఢిల్లీ: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128  కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.

24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో  కోవిడ్‌ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement