జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురి మావోయిస్టులు మృతి | Jharkhand: 4 Maoists deceased in encounter in West Singhbhum district | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టుల మృతి

Published Mon, Jun 17 2024 10:41 AM

Jharkhand: 4 Maoists deceased in encounter in West Singhbhum district

రాంచి: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

టోంటో, గోయిల్‌కేరా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను టార్గెట్‌ చేస్తూ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి అమోల్‌ వి హోమ్‌కర్‌ తెలిపారు. 

‘‘ఎదురు కాల్పుల్లో నాలుగు మావోయిస్టులు మృతి చెందారు.అందులో  ఒక మహిళా మావోయిస్టు ఉంది. మరో ఇద్దర మావోయిస్టులను అరెస్ట్‌ చేశాం. ఘటన స్థలం నుంచి రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

ఇక.. రెండు రోజుల క్రింతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు, ఒక స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జవాన్‌ మృతి చెందారు.

Advertisement
 
Advertisement
 
Advertisement